TG: మంత్రుల వ్యవహార శైలిని కాంగ్రెస్ సీనియనేత వీహెచ్ తప్పుబట్టారు. పద్దతి మార్చుకోవాలని.. లేదంటే పార్టీకి నష్టం అంటూ హెచ్చరించారు. 'నియోజకవర్గాల పర్యటనలో ఇంచార్జ్‌లను పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని బాధ్యతలు చూస్తున్నారు. అలాంటి వారిని పిలవకపోవడం నాయకులను అవమానించడమే. ఓడిపోయిన నాయకుడిని మంత్రులు వదిలేస్తే ఎట్లా?' అంటూ ప్రశ్నించారు.