మైనర్‌పై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

దిల్లీలో 17 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం అనంతరం బాలికను హత్య చేసి, మృతదేహాన్ని పొలంలో పడేసినట్లు వెల్లడించారు. అక్కడ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕