వరుసకు చెల్లెలు అయ్యే మైనర్‌పై వేధింపులు.. బాలిక ఆత్మహత్య !

వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం నాసన్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే జనార్దన్, సావిత్రి దంపతుల కుమార్తె, నవపేట్ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతోంది. పరీక్షలు ముగించుకొని ఇంటికి రాగా, వరుసకు చెల్లెలు అయ్యే మైనర్‌పై మద్యం మత్తులో సాకేత్ అనే యువకుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవంతంగా వేధించినట్లు తెలుస్తోంది. అన్నలాంటి వాడిని వదిలేయమని బాలిక వేడుకున్నా వినకుండా కామాంధుడు తన కోరిక తీర్చుకున్నాడు. జరిగిన అవమానంతో ఎవరికీ చెప్పుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడు సాకేత్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్