పెళ్లి చేసుకుంటానని చెప్పి మైనర్‌పై అత్యాచారం

TG: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గనుకుంట్ల మురళీ కృష్ణ, కాలేజీకి వెళ్తున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. జూన్ 29న టీసీ కోసం వెళ్తున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెద్దపల్లి జిల్లా నిరుకుల్లా గ్రామంలోని ఆలయం వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్