ఉరుగ్వేలోని మోంటెవీడియోలో పైసండు జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ హైవేపైకి బంతి వెళ్లడంతో రోడ్డు ప్రమాదానికి దారితీసింది. బంతిని తప్పించబోయి ఒక కారు బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న మరో కారు దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మ్యాచ్‌కి అంతరాయం కలిగినా, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఆట కొనసాగింది. ఈ సంఘటన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.