ఉత్తరప్రదేశ్‌లోని మోడీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కిరాణా సామగ్రి కొనడానికి వెళ్లిన బాలిక పట్ల వీధి వ్యాపారి అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.