దేశవ్యాప్తంగా మందుల ధరలు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఔషధ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలపై కనీస దిగుమతి ధర (MIP) విధించనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గి, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే పెన్సిలిన్ G, 6APA, అమోక్సిసిలిన్ వంటి కీలక పదార్థాలపై MIP అమలు చేస్తే 10,000కి పైగా MSME యూనిట్లు దెబ్బతిని, లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చివరికి రోగులకే భారం అవుతుందంటున్నారు.