త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం.. అమృతకుండంలో శివలింగ దర్శనం (వీడియో)

మహారాష్ట్రలోని నాసిక్ ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయ సముదాయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చారిత్రాత్మక అమృతకుండంలో ఎన్నో సంవత్సరాల తర్వాత శివలింగం దర్శనమిచ్చింది. పురావస్తు శాఖ పరిరక్షణ పనుల్లో భాగంగా 65 అడుగుల లోతున్న కుండంలోని నీటిని తొలగించగా శివలింగం వెలుగులోకి వచ్చింది. పేష్వాల కాలం నాటి ఈ అమృతకుండంలోని నీటిని ఆలయ పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం అమృతకుండంలోకి భక్తుల ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్