పూరీలో అద్భుతం.. నీలచక్రంలో చంద్రుడు

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంలో చంద్రుడు పూర్తిగా ఒదిగిపోయి భక్తులను ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుతమైన ఖగోళ ఘటనను చూసేందుకు ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు, స్థానికులు అమితమైన ఆసక్తి చూపారు. కార్తీక పౌర్ణమి రాత్రి కావడంతో ఈ దృశ్యం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది అందరికీ కనువిందుగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕