AP: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ భవానీ భక్తుల ఇరుముడులను తాకి అపచారం చేశారని గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి రోజు ఫొటో కోసం అత్యుత్సాహం చూపిన చైర్మన్, ఈవో.. భవానీ భక్తుల ఇరుముడిని విప్పారని ఆరోపించారు. సాధారణ వ్యక్తులు తాకరాదనే నిబంధన ఉన్నప్పటికీ, ఈవో, ఛైర్మన్ అమ్మవారి పవిత్రతను దెబ్బతీశారని, హిందువుల మనోభావాలను చులకన చేశారని గురు భవానీలు మండిపడ్డారు.