వెల్లింగ్టన్‌లో ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్ న్యూజిలాండ్ విమానం (NZ272) రన్‌వేను తాకే సమయంలో తీవ్రమైన గాలి ఉధృతి, భారీ వర్షం కారణంగా ప్రమాదకరంగా మారింది. అయితే, పైలట్ కేవలం 2 సెకన్లలో అప్రమత్తమై, ల్యాండింగ్‌ను నిలిపివేసి విమానాన్ని తిరిగి ఆకాశంలోకి పంపారు. పైలట్ తీసుకున్న నిర్ణయం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి, పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.