భారతీయ నౌకపై క్షిపణి దాడి

యెమెన్ తీరానికి సమీపంలో భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్‌వి ఫైజ్ నూరే ఒలియా అనే కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో నౌక సముద్రంలో మునిగిపోయినప్పటికీ, నౌకలోని 13 మంది భారతీయ నావికులను యెమెన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించింది. అనంతరం వారిని మొఖా నౌకాశ్రయానికి తరలించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో నావికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్