చిన్నారి మిస్సింగ్.. ఆచూకీ చూపని కుక్క (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌లో 7 రోజులుగా కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం అధికారులు వినూత్నంగా గాలించారు. చిన్నారితో పాటు వెళ్లిన కుక్కకు GPS ట్రాకర్ అమర్చి వెతికారు. అయితే, కుక్క సమీప తోటలు, ప్రధాన రహదారిలో తిరిగిన తర్వాత ఇంటి పరిసరాల్లోకే తిరిగి వచ్చింది. అడవుల్లోకి వెళ్తే పాప జాడ దొరుకుతుందని ఆశించినా అధికారులకు నిరాశే ఎదురైంది. కుక్క వింత ప్రవర్తనపై విమర్శలు వస్తుండగా, దానిపై ఆధారపడటంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్