లక్షల్లో ధర పలుకుతున్న మియాజాకీ మామిడి.. కారణం ఇదే!

ప్రస్తుతం మార్కెట్లలో మామిడి పండ్లు కిలో రూ.100-200 మధ్య లభిస్తుండగా, జపాన్‌కు చెందిన 'మియాజాకీ' మామిడి పండ్లు మాత్రం కిలో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడిని జపాన్‌లోని మియాజాకీ నగరంలో పండిస్తారు. దీనిని జపనీస్ భాషలో 'తైయో-నో-తమాగో' (సూర్యుని గుడ్డు) అని పిలుస్తారు. ఇర్విన్ రకానికి చెందిన ఈ మామిడి పండ్లు డ్రాగన్ గుడ్లలా కనిపించడంతో పాటు, డార్క్ రెడ్ లేదా పర్పుల్ రంగులో మెరుస్తాయి. వీటిని సాధారణ మార్కెట్లలో కాకుండా ఆర్డర్ల ద్వారానే విక్రయిస్తారు.

సంబంధిత పోస్ట్