లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని, లేదంటే సీఎం విజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నిందితుడిని కాపాడుతోందని తమిళిసై ఆరోపించారు.