కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు

TG: ఫిరాయింపు విచారణ ఎదుర్కొంటున్న పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిన్న రాత్రి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ నంది నగర్ నివాసంలో KCRను కలిసి మధుసూదన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని, క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని దిశా నిర్దేశం చేశారు. కాగా గూడెం మహిపాల్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వస్తారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్