ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: కౌశిక్‌రెడ్డి

ఏ తప్పు చేయకపోయినా, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తన కుటుంబానికి, BRS కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం బాధ కలిగించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో తన కుటుంబాన్ని, BRS కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తనను లక్ష్యంగా చేసుకోవాలని, తనపై కేసులు పెట్టాలని, తనకు నోటీసులు ఇవ్వాలని, కానీ తన కుటుంబాన్ని, BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గబోనని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని, నిలదీస్తూనే ఉంటానని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేసే బాధ్యత అని, ప్రశ్నించే గొంతును అణచలేరని, ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్