TG: సిరిసిల్లలో మదీనా యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్.. క్రీడాకారులతో కలిసి ఫోటోలు దిగి, విజేతలకు బహుమతులు అందజేశారు.