కర్ణాటకలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఓ ఎమ్మెల్సీ తనపై అత్యాచారం చేశాడని జనతాదళ్‌కు చెందిన ఓ పురుష కార్యకర్త.. సీఎం, హోంమంత్రి, డీజీపీ, హసన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిసానని, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మబలికి బలాత్కారం చేశాడని బాధితుడు ఆరోపించాడు. బాధితుడిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని, అతని ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ మహ్మద్ సజీదా తెలిపారు.