త్వరలో మొబైల్ టారిఫ్‌ల పెంపు?

మొబైల్ వినియోగదారులపై త్వరలోనే టారిఫ్‌ల భారం పెరిగే అవకాశముంది. దేశంలో మొబైల్ సేవల సగటు నెలవారీ ఛార్జీ రూ.350కు చేరాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విద్యుత్, ఇంధన ఖర్చులు, ఉద్యోగుల వేతనాల కారణంగా టారిఫ్‌ల పెంపు అనివార్యమని పేర్కొన్నారు. 5జీ, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరమని తెలిపారు. నెలకు రూ.350 అంటే రోజుకు రూ.10-12 మాత్రమేనని, డిజిటల్ సేవల వినియోగంతో పోలిస్తే ఇది తక్కువేనని ఆయన వివరించారు. అయితే టారిఫ్‌ల పెంపుపై కంపెనీ అధికారిక నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕