బ్యాంకాక్ నుంచి ముంబైకి వచ్చిన 28 ఏళ్ల మోడల్ హర్షా సన్నీ హైడ్రోపోనిక్ గంజాయితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించగా.. తన లగేజీ బ్యాగులో దాచిన 11 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దర్శనమిచ్చింది. సుమారు రూ.11.82 కోట్ల విలువైన ఈ గంజాయిని జూన్ 10, 11 తేదీల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ (TG-351)లో ఆమె తరలించింది. అనుమానాస్పద ప్రవర్తనతో అధికారుల తనిఖీలో దొరికిపోయిన ఆమెను NDPS చట్టం కింద అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు.