తెలంగాణలో ఈనెల 7వ తారీఖు వరకు మోస్తారు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ లాంటి ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.