తెలంగాణలో శని, ఆదివారం మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఈ మేరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.