తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంలేదు. భారీ వర్షం పడేలా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నా.. ఈదురుగాలులకు అంతలోనే మబ్బులు తేలిపోతున్నాయి. దీంతో చిరుజల్లులు తప్ప మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటం లేదు. కాగా రేపు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.