భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ: కేంద్ర మంత్రి షెఖావత్

ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో భారత ప్రతిష్ఠ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ఒకప్పుడు భారత గుర్తింపు ప్రధానంగా గాంధీజీతోనే ముడిపడి ఉండేదని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు చెప్పగానే మోదీ గుర్తుకు వస్తున్నారని అన్నారు. ఈ మార్పు దేశ ప్రతిష్ఠను పెంచడమే కాకుండా పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్