ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ను మోదీ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తన ఫోన్ను చూపిస్తూ, అందులోనే మోదీకి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని, ట్యాప్ చేస్తున్న ఆయనకు కూడా ఈ విషయం తెలుసని అన్నారు.