ప్రధాని మోదీ కిర్గిస్థాన్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. కిర్గిస్థాన్లో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం VI World Nomad Games ప్రారంభోత్సవానికి వారు కలిసి వెళ్లారు. గతేడాది పుతిన్ భారత పర్యటన సందర్భంగా కూడా మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. నాడు యూరప్ కార్లలో కాకుండా జపాన్కు చెందిన టయోటా ఫార్చునర్లో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది.