ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ప్రజాదరణ పొందిన నాయకుడని, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం సుపరిపాలన అందించడంలో ముందుండి నడిపిస్తున్నారని మోదీ కొనియాడారు. దీనిపై పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ అభిమానం, ప్రోత్సాహం ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేసేందుకు ఉత్సాహాన్నిస్తోందన్నారు. మోదీ మార్గదర్శకత్వంలో ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.