భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ గౌరవ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో మోదీ ఆమెను సంతూర్ వాయించమని కోరారు. మొదట తటపటాయించినా, మోదీ స్వయంగా వాయించి చూపించడంతో ఆమె సంతూర్ వాయించారు. ఆమె వాయించిన తీరును అందరూ చప్పట్లతో అభినందించారు.