జోర్డాన్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా చేరుకున్నారు. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ఆయనకు ఘన స్వాగతం పలికి, అనూహ్యంగా సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్‌షిప్ పార్క్‌ను చూపించారు. ఇది ప్రయాణ ప్రణాళికలో లేనిది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం, వాణిజ్యంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. భారతదేశం ఇథియోపియాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య రూ. 5,175 కోట్ల వాణిజ్యం జరిగింది.