విమాన ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే ఘటన స్థలాన్ని పరిశీలించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయాపడినవారిని కూడా పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక గురువారం జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే.