మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట

తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ జరిపారు. ఈ నెల 24 వరకు పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 'గొడవ మోహన్ బాబు కుటుంబ వ్యవహారం.. ఆయన ఇంట్లో మీడియాకు ఏం పని' అని జడ్జి ప్రశ్నించారు. పోలీసులు మోహన్ బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్