మాలీవుడ్ డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్

లైంగిక వేధింపుల ఆరోపణలపై మాలీవుడ్ డైరెక్టర్, నటుడు రంజిత్ బాలకృష్ణన్‌ను కేరళ పోలీసులు మార్చి 31న అరెస్ట్ చేశారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నిర్మాణంలో ఉన్న సినిమా సెట్‌లో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో ఈ అరెస్ట్ జరిగింది. గతంలోనూ నటీమణులు ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేశారు. 2024 ఆగస్టులో శ్రీలేఖ మిత్రా చేసిన ఆరోపణల నేపథ్యంలో రంజిత్ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ అరెస్ట్ మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్