‘అమ్మా.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తా’.. ప్రెస్‌ మీట్‌ ఆపేసిన నితీశ్ (వీడియో)

ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించగా, మ్యాచ్ అనంతరం తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్‌ రెడ్డి చేసిన ఓ చిన్న పని అభిమానుల మనసులు గెలుచుకుంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా అతడి ఫోన్ మోగింది. అది తన తల్లి కాల్ అని గుర్తించిన నితీశ్, మీడియాకు సారీ చెప్పి, క్షణం ఆగి ‘‘అమ్మా.. నేను ఐదు నిమిషాల తర్వాత కాల్ చేస్తా’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం మీడియా ప్రతినిధులకు మళ్లీ క్షమాపణలు చెబుతూ ఇంటర్వ్యూను కొనసాగించాడు. తల్లిపై అతడు చూపిన గౌరవం, వినయం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్