మోనాలిసా మేజరే.. భర్తకు కేరళం హైకోర్టు బెయిల్

కుంభమేళా వైరల్ గర్ల్‌గా గుర్తింపు పొందిన మోనాలిసా సమర్పించిన పత్రాల ఆధారంగా ఆమె ప్రాథమికంగా మేజర్‌ అని భావించవచ్చని కేరళం హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కిడ్నాప్, పోక్సో కేసులు ఎదుర్కొంటున్న ఆమె భర్త ఫర్మాన్‌కు కోర్టు నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. మోనాలిసా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధ్యప్రదేశ్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే మోనాలిసా జనన తేదీ ధ్రువీకరణ పత్రం నకిలీదని మధ్యప్రదేశ్ పోలీసుల తరఫున వాదనలు వినిపించినప్పటికీ, కోర్టు వాటిని అంగీకరించలేదు. కేసుపై తదుపరి విచారణ కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్