అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా డబ్బులు: మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, మొండిగోడలు, స్లాబ్ స్థాయిలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి రూ.2 నుంచి 3లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. శనివారం జనగామా జిల్లాలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని మంత్రి తెలిపారు. అలాగే సగంలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి ప్రజలు అందిస్తామన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕