ఈనెల 18లోపు అకౌంట్లలో డబ్బులు జమ

TG: మహిళా స్వయం సహాయక సంఘాల(SHG) అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది. రూ.344 కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు రిలీజ్ చేసింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు రూ.44 కోట్లు విడుదల చేసింది. ఈ డబ్బులు ఈనెల 18లోపు సంఘాల ఖాతాల్లో జమ అవుతాయి. ఈలోపు రాష్ట్ర సర్కార్ గ్రామాలు, మండలాల్లో 'ఇందిరా మహిళా శక్తి' కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యేల ద్వారా చెక్కులు పంపిణీ చేయనుంది.

సంబంధిత పోస్ట్