ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, రానున్న రోజుల్లో డబ్బుకు విలువ ఉండదని జోష్యం చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోలు వస్తువులను, సేవలను సులభంగా తయారు చేస్తాయని, దీనివల్ల మనుషులకు పనులు తగ్గిపోయి, ప్రభుత్వాలు నేరుగా డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పని చేయకుండానే ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడి, పని, ఆదాయం, డబ్బు అనే భావనలు మారిపోతాయని మస్క్ అంచనా వేశారు. ఏఐ, ఆటోమేషన్ వల్ల ఏర్పడే కొరత లేని ఆర్థిక వ్యవస్థ (పోస్ట్-స్కార్సిటీ ఎకానమీ) గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.