హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒక పెన్షనర్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్న రూ. 81,800 నగదు ప్యాకెట్‌ను కోతి లాక్కెళ్లి, చెట్టుపై నుంచి కిందకు విసిరేయడంతో నోట్లు చెల్లాచెదురయ్యాయి. స్థానికులు అప్రమత్తమై నోట్లను ఏరి తిరిగి వృద్ధుడికి అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని రూ.500 నోట్లు చిరిగిపోయాయని సమాచారం. నగరంలో కోతుల బెడదపై ఈ ఘటనతో మళ్ళీ చర్చ మొదలైంది.