ఉద్యోగి తలపై వాలిపోయిన కోతి (వీడియో)

TG: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సాదిక్ అనే ఉద్యోగి భుజాలపైకి ఒక కోతి ఎక్కి నిద్రపోయింది. సిబ్బంది దానిని తరిమేసే ప్రయత్నం చేసినా, కోతి మాత్రం సాదిక్ భుజాలపై దాదాపు గంటకు పైగా సేదతీరింది. మొదట భయపడినప్పటికీ, కోతి ప్రదర్శించిన ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనను చూసినవారు సెల్‌ఫోన్‌లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్