జనసేనలోకి చేరిన 1000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు

AP: కాకినాడ జిల్లా సామర్లకోట, పెద్దాపురంలో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు జనసేనలో చేరారు. మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సాయిప్రసాద్‌తో పాటు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే నానాజీ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని జనసేన నేతలు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕