మృతదేహాన్ని మార్చి ఇచ్చిన మార్చురీ సిబ్బంది.. చివరకి (వీడియో)

TG: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మార్చురీ సిబ్బంది.. కుటుంబ సభ్యులకు వారి తాలూకా మృతదేహం కాకుండా వేరే వ్యక్తి మృతదేహాన్ని ఇచ్చిన ఘటన కలకలం రేపింది. రాయపర్తి మండలం మైలారానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దహన సంస్కారాల్లో డెడ్ బాడీ కుమారస్వామిది కాదని బంధువులు గుర్తించి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్