ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ హైవే వద్ద రామ్ తపస్ధలీ బ్రహ్మపురిలో విషాద ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఓ కార్యక్రమానికి వచ్చిన మను ఉపాధ్యాయ్ అనే తల్లి, ఆమె కూతురు గౌరీ గంగా నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఉదయం గంగా తీరం వద్దకు వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. మరొకరిని కాపాడేందుకు దిగిన వ్యక్తి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.