విశాఖపట్నం, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలంలో ఒక ప్రైవేట్ లాడ్జిలో తల్లి, కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను గాజువాకకు చెందిన గయప్పాంజన్ (39), అతని తల్లి నీలావతి (59)గా గుర్తించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గయప్పాంజన్, అతని భార్య మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురువారం సాయంత్రం తల్లితో కలిసి లాడ్జికి వచ్చిన గయప్పాంజన్, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.