దీపావళికి ఇంటిని శుభ్రం చేయమన్న తల్లి.. సెల్ టవర్ ఎక్కిన యువతి (వీడియో)

పండగ అంటేనే శుచి, శుభ్రత. ఇంటిని, ఒంటిని క్లీన్‌ చేసుకొని భక్తితో ఫెస్టివల్‌ని జరుపుకుంటారు. అయితే, యూపీలోని మీర్జాపూర్‌లో దీపావళి వేడుకలకు సంబంధించి ఇంటిని శుభ్రం చేసే విషయంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పండగకు ముందు ఇంటిని శుభ్రం చేయమని తల్లి చెప్పినందుకు అలిగిన యువతి సెల్ టవర్‌పై ఎక్కి హల్‌చల్ చేసింది. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను సురక్షితంగా కిందకు దింపారు.

సంబంధిత పోస్ట్