కవలలను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

బెంగళూరులోని వజ్రహళ్లిలో ఐవీఎఫ్ ద్వారా జన్మించిన మూడు నెలల కవల కుమార్తెలను ఉమాదేవి అనే తల్లి మంగళవారం మధ్యాహ్నం హత్య చేసింది. అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా, అప్పుడే ఇంటికి చేరుకున్న భర్త రామలింగప్ప ఆమెను అడ్డుకున్నాడు. నీటిలో ముంచి పిల్లలను చంపినట్లు అనుమానిస్తున్నారు. ప్రసవానంతర కుంగుబాటు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఉమాదేవి ఈ చర్యకు పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్