AP: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కూర్మారపు వరలక్ష్మి అనే మహిళ తన ఇద్దరు పిల్లల గొంతులు కోసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.