ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

పంజాబ్‌లోని మాన్సాలో గురువారం సాయంత్రం 36 ఏళ్ల సందీప్ కౌర్ తన ముగ్గురు పిల్లలను చంపి, ఆపై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమార్తెకు విషమివ్వగా, మిగిలిన ఇద్దరిని గొంతు నొక్కి చంపినట్లు అనుమానిస్తున్నారు. బంధువు వచ్చి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మరణం తర్వాత కౌర్ రెండో పెళ్లి చేసుకుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్