తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లి మండం మద్దులపల్లిలో హారిక (30) అనే వివాహిత గురువారం పురుగుల మందు తాగింది. ముందు తన ఇద్దరు పిల్లలు కృష్ణకాంత్ (10), లక్ష్మి (8)కి తాగించి తర్వాత తాను తాగింది. అయితే చుట్టుపక్కల వారు గమనించి ఆసుపత్రికి తరలించగా అదే రోజు హారిక చనిపోయింది. పిల్లలు చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. భర్త వివాహేతర సంబంధం కారణంగానే హారిక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.