మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం తల్లి అఖిల.. ఆమె రెండేళ్ల కుమారుడు రియాన్స్ గౌడ్‌ను చంపి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే అఖిల భర్త మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.